యాభై రూపాల చీర ఉయ్యాలో మాకు ఇచ్చిండమ్మ ఉయ్యాలో..

19:05 - September 19, 2017

యాభై రూపాల చీర ఉయ్యాలో మాకు ఇచ్చిండమ్మ ఉయ్యాలో.. మీరిచ్చె ఈ శీరె ఉయ్యాలో.. మీ బిడ్డ గడ్తదా ఉయ్యాలో.. మీ భార్యగడ్తదా ఉయ్యాలో.. మీ కోడల్ గడ్తదా ఉయ్యాలో.. తెలంగాణల నిన్నటి సంది ఇదే మోతమోగుతున్నది.. ఆడోళ్లైతె కేసీఆర్ మీద ఆయన కొడ్కు మీద ఏడేడు దోశల మన్నెత్తి పోస్తున్నరు.. మేము గింత అగ్వగనిపిచ్చినాం అని.. సూడుండ్రి..

తెలంగాణల బట్టలు నేశెటోళ్లే కర్వైండ్రా..? గద్వాల కాడికెళ్లి మొదలు వెడ్తె శిరిశిల్ల దాక ఎన్ని మగ్గాలు లేవు ఎంత గొప్ప పనోళ్లు లేరు..? ఆరు గజాల శీరెను అగ్గిపెట్టెల వెట్టిన ఘనకీర్తి గళ్ల నేతన్నలు వున్న గడ్డ ఈ తెలంగాణ.. ఈడ నేసుడు సరిపోదనుకుంటే.. ధర్మవరం అసొంటి జాగలకు వంపి చేపిస్తె ఏమైతుండే..? రెండువందల ఇర్వై కోట్ల దాక ఖర్చువెట్టినమంటిరి.. నేత కార్మికులకు దక్కింది లేదు.. నడ్మెవ్వడో బ్రోకర్లు మింగిరి ఒడ్సిపాయే..

ఆ అయ్యా కల్వకుంట్ల తారక రామారావుగారూ..? రాండ్రి మీరు వంచిన చీరెలు ఓ నాల్గు వట్కోని మీరు రాండ్రి.. వద్దని తిట్టి ఆవేదన ఎల్లగక్కిన అమ్మలక్కను నేను తీస్కొస్త.. ఆబిడ్స్ చౌరస్తకాడ గూసుందాం.. ఎవ్వలు ఎవ్వలిని మోసం జేశింది ఏం కథ..? సూపెడ్త రాండ్రి.. అమ్మలక్కలు చీరెలు గాలవెడ్తె కేసులు వెట్టిస్తావ్..? కాలవెడ్తె కేసులు వెట్టిచ్చనవ్ గదా... మరి నేత చీరెలిస్తాని.. పాలిస్టర్ శీరెలిచ్చిన మీ మీద ఏం బెట్టాల్నయ్యా..?

ట్రాఫిక్ పోలీసోళ్లకే సుక్కలు జూపెట్టిండు ఒక తాగువోతు.. కడ్పునిండ దాగి బండిమీదొస్తుంటే.. ఆపిండ్రట.. పోలీసోళ్లు ఆపంగనే గుండె నొప్పి గుండె నొప్పని కిందవడిపోయిండట.. వానికి ఎర్కేగదా..? ఇగ ఎట్లైనా నోట్లె పైపు వెట్టి ఊదిపిస్తరని.. ఇగ ఈ ఏశం గట్టిండు.. పోలీసోళ్లు పరేషాన్ అరే వీన్ని ఊకెనన్న ఆపితిమిరా అని... తర్వాత ఏమైందో సూడుండ్రిగ..

ఎవ్వడన్న పోలీసోడుగానీ.. ప్రభుత్వ అధికారి గానీ.. లంచం అడ్గితె.. ఆడనే కాలి చెప్పుదీశి రెండు సప్పరియ్యుండ్రి ఏంగాదు..? అసలు పోలీసోనికి లంచం ఎందుకియ్యాలే... ? వానికి జీతం రాదా..? కోర్టుల కేసు తశ్వ అయ్యింది.?. ఇరువర్గాలు రాజీపడ్డయ్ ఒడ్సిపాయే.. రెండు లక్షల రూపాల లంచంగావాలె అని ఒకతాన ఎస్ఐ గాడు ఎంత పెద్ద పనిజేశిండో సూడుండ్రి..

బంగారు తెలంగాణల నేను గూడ భాగమైత.. రాష్ట్రప్రభుత్వానికి నా వంతు పన్నుగట్టి అభివృద్ధిల పాలువంచుకుంట అనుకున్నట్టున్నడు ఒక సర్కారు బడి పంతులు.. ఎక్వ పన్ను చెల్లించాలే అని.. ఎక్వ తాగిండు.. అదే తాగిన సంతోషంతోని తన బడికొచ్చి ఎంత హ్యాపీగ నిద్రవోతున్నడంటే..? ఈ లోకాన్ని మర్శిపోయి మరీ తన్మయం బొందుతున్నడు.. నాతోని గాలేదు జర్ర మీరన్న నిద్రలేపితె ఇంటికన్నతోలిద్దాం..

Don't Miss