చక్కెర ఎక్కువ తీసుకుంటే..

17:07 - August 25, 2017

తీపి పదార్థాలు అంటే చాలా మందికి ఇష్టమే. కానీ ఇష్టం కదా అని ఎక్కువగా తీసుకుంటే మాత్రం జర భద్రం అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా పురుషులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలంట. చక్కెర ఎక్కువగా తీసుకుంటే బుద్ధి మాంద్యం..మానసిక ఆందోళన.. లాంటి సమస్యలు వస్తాయంట. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిని అధ్యయనం చేయగా డయాబెటీస్ తో పాటు అధిక కొలెస్ట్రాల్..ఒబెసిటీ..గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నట్లు తేలిందంట. ఇది వరకే పలు అధ్యయాలు ఈ విషయాన్ని చెప్పాయి కూడా. తాజాగా 22 ఏండ్ల కన్నా ఎక్కువ వయసు ఉన్న 8 వేల మందిని పరిశీలించగా ఈ విషయం వెల్లడైంది. చక్కెర అధికంగా వాడితే బుద్ధిమాంధ్యం, మానసిక ఆందోళన సమస్యలు ఉత్పన్నం కావడానికి 23 శాతం అవకాశం ఉందంట. సో..చక్కెర ఎక్కువగా తీసుకోకండి...

Don't Miss