క్యాష్ లెస్..యాప్ లతో ప్రమాదం ఉందా ?

20:24 - December 13, 2016

కూరగాయలు కొనటానికి స్వైపింగ్..పచారీ కొట్లో పేటీఎం..షాపింగ్ మాల్ లో డెబిట్ కార్డ్.. మనీ ట్రాన్స్ ఫర్ కు ఆన్ లైట్ ట్రాన్సాక్షన్.. అంతా క్యాష్ లెస్.. ఓన్లీ ఆన్ లైన్..వినటానికి బానే ఉంది.. కానీ, ఇక్కడే అసలు సమస్య మొదలౌతోందా? వైరస్ లు మాల్ వేర్ లు కుప్పలు తెప్పలుగా పొంచి ఉన్నాయా? మీ స్మార్ట్ ఫోన్ ని కబళించే ప్రయత్నాలు చేస్తున్నాయా? ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా …. ఎకౌంట్ లో సొమ్ముతో పాటు, వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్.. అంతా ఊడ్చేసే ప్రమాదం ఉందా? ఈ అంశంపై ప్రత్యేక కథనం..క్లీన్ మాస్టర్, మెమోరీ బూస్టర్, స్టాప్ వాచ్ , వైఫై ఎన్ హాన్సర్... ఏమిటివన్నీ అంటున్నారా? ఇవన్నీ వస్తూ వస్తూ స్మార్ట్ ఫోన్ శత్రువులను వెంటబెట్టుకొచ్చే యాప్ లు. పొరపాటున వీటిని మీ ఫోన్ లో రానిస్తే ఇక జరిగే ప్రమాదం ఊహించలేరు. ఇవే కాదు ఇలాంటి యాప్ లు ఇంకా చాలా ఉన్నాయి.

సైబర్ భద్రతా ప్రమాణాలు..
వైరస్ దాడులు పొంచి ఉన్నాయి..సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు..నేరాల సంఖ్య పెరుగుతోంది.. ఏ యాప్ లో ఏ ముప్పు ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో క్యాష్ లెస్ ఇండియా కు పెద్ద సవాలే కనిపిస్తోంది. గూలిగన్ మీ ఎకౌంట్ గుట్టు రట్టు చేయాలని చూస్తోంది.. ఆకర్షణీయమైన యాప్ ల పేర్లతో సర్రున దూసుకొస్తోంది. పేమెంట్ గేట్ వే ల రూపంలో మాయ చేయటానికి తయారవుతున్నాయి. క్యాష్ లెస్ అయ్యే ఆరాటంలో కొంచెం ఆత్రపడినా అసలుకే మోసం వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఓ పక్క కరెన్సీ అందుబాటులో లేదు.. ఏటీఎంలు తెల్లమొహం వేసి నిలబడ్డాయి..బ్యాంకులు భరోసా ఇవ్వటం లేదు. క్యాష్ లెస్ వైపు వెళ్లటానికి ఎన్నో అడ్డంకులు, మరెన్నో ప్రమాదాలు పొంచి ఉన్న పరిస్థితి.. ఇవన్నీ కలిసి సామాన్యుణ్ని దిక్కుతోచని స్థితిలో పడేస్తున్నాయి. క్యాష్ లెస్ తో దేశానికి జరిగే మేలు మాట తర్వాత...వైరస్ లు మాల్ వేర్ లతో స్మార్ట్ ఫోన్ మునిగిపోయే ప్రమాదం మాత్రం చాలా ఉంది. వినియోగదారులను టెక్నికల్ గా అప్ డేట్ చేయటమే కాదు.. సైబర్ భద్రతా ప్రమాణాలు పెంచకపోతే ఊహించని అనర్థాలను అనేకం ఎదుర్కోక తప్పదు. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss