దీపావళికి ముందే ఢిల్లీలో కాలుష్యం...

11:39 - November 5, 2018

ఢిల్లీ : దేశ రాజధానిని కాలుష్యం మళ్లీ హఢలెత్తిస్తోంది. గత కొన్ని రోజులుగా కాలుష్యం అధికమవుతుండడంతో ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాలుష్యం తగ్గేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోంది. వాతావారణ శాఖ కూడా పలు సూచనలు చేస్తోంది. కానీ కాలుష్యం ఏమాత్రం తగ్గడం లేదు. ముందే చలికాలం కావడం..పొగమంచుకు తోడు కాలుష్యం అధికంగా ప్రబలుతోంది. 
Image result for Delhi Pollutionసోమవారం కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. పీఎం లెవల్ 700 పాయింట్లకు చేరుకుంది. సెంట్రల్ ఢిల్లీ, మందిర్ మార్గ్, ధ్యాన్‌చంద్, జవహార్ లాల్ స్టేడియం తదితర ప్రాంతాల్లో కాలుష్యం అధికంగా ఉంది. కాలుష్య తీవ్రత అధికంగా నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఐదు వందల మీటర్ల లోబడి కనిపించడం లేదు. దీనితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 500 మీటర్ల మేర దుమ్మధూళి వ్యాపిస్తోంది. 
Image result for Delhi Pollutionశ్వాసకోశ వ్యాధులు అధికమౌతున్నాయి. అత్యవసరమయితే ఇంటి నుండి బయటకు రావాలని అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పంటలను కాల్చిన అనంతరం వచ్చే పొగ, వాహనాల నుండి వచ్చే పొగ..వివిధ పరిశ్రమల నుండి వచ్చే పొగ కారణంగా కాలుష్యం అధికమౌతోందని కాలుష్య నియంత్రణ మండలి భావిస్తోంది. మరోవైపు దీపావళి పండుగ రాకముందే కాలుష్యం అధికం కావడం ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా కాల్చే పటాసులతో మరింత కాలుష్యం అధికమౌతోందని తెలుస్తోంది. దీనితో పటాసులపై నియంత్రణ విధిస్తారా ? లేదా ? అనేది చూడాలి. ఇప్పటికే సుప్రీంకోర్టు పటాసుల కాల్చడంపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కానీ పటాసుల దుకాణాలు ఢిల్లీలో అధికంగా కనిపించడం లేదు. 

Don't Miss