పెద్దవి వద్దు,చిన్నవే ముద్దు అంటున్న 'అల్లుడు'..

13:05 - August 17, 2018

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన యంగ్ హీరో సాయి శ్రీనివాస్‌. తొలి సినిమా అల్లుడు శీనుతోనే వినాయక్‌ లాంటి స్టార్ డైరెక్టర్‌, సమంత లాంటి టాప్ హీరోయిన్‌తో ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు ఈ సినిమాలో తమన్నాతో స్పెషల్ సాంగ్‌ లో ఆడిపాడాడు. మరో స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌తో జయ జానకి నాయక సినిమా చేశాడు. తొలి సినిమాకంటే రెండవ సినిమా కొంచెం మెరుగ్గా ఆడింది. మూడవ సినిమా సాక్ష్యం సినిమాలో శ్రీనివాస్ పూజా హెగ్డే హీరోయిన్‌గా వచ్చింది మంచి పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్స్ తో జోడీ కడుతూ .. ఫారిన్ లొకేషన్స్ లో డ్యూయెట్స్ పాడుతూ వస్తున్నాడు. ఒక స్టార్ హీరో సినిమాను ఏ స్థాయిలో తెరకెక్కిస్తారో .. ఆ స్థాయిలో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు తెరకెక్కుతూ వస్తున్నాయి.

రూటు మార్చిన అల్లుడు శ్రీను..
పెద్ద బడ్జెట్ తో పెద్ద డైరెక్టర్లతో పెద్దగా వర్క్ అవుట్ కాలేదనే ఆలోచనలో వున్న ఈ యంగ్ హీరో రూట్ మార్చాడు..చిన్న సినిమాలు చేసుకుంటు కొత్త దర్శకులతో ముందుకు వెళ్లాలనుకుంటున్నాడు. పెద్ద బడ్జెట్ తో పెట్టుబడి పెట్టినంత స్థాయిలో బెల్లంకొండ శ్రీనివాస్ కి మార్కెట్ లేకపోవడం వలన, సహజంగానే నష్టాలు వస్తున్నాయి. అందుకే పెద్ద సినిమాలు చేయించకుండా, కంటెంట్ వున్న చిన్న సినిమాలు చేయించాలనే నిర్ణయానికి నిర్మాత బెల్లంకొండ వచ్చినట్టు సమాచారం. కొత్త దర్శకుల దగ్గర సిద్ధంగా వున్న కథలను వరుసబెట్టి బెల్లంకొండ వింటున్నాడట. కంటెంట్ కొత్తగా వుందనిపిస్తే సెట్స్ పైకి పంపించేస్తాడన్న మాట. దీనిని బట్టి బెల్లంకొండ శ్రీనివాస్ కొంతకాలం పాటు కొత్త దర్శకులతో చిన్న సినిమాలు చేయనున్నట్టు స్పష్టమవుతోంది.  

Don't Miss