'కుంకుడు'తో ప్రయోజనాలు..

16:59 - May 26, 2017

ఆడవారు..మగవారికి జుట్టు ఉంటేనే అందం. కొంతమందికి జుట్టు రాలిపోతుండడంతో పలు సమస్యలను ఎదుర్కొంటుంటారు. మొదట్లో జట్టు అందంగా..ఒత్తుగా ఉండేందుకు...కుంకుడు కాయలను ఉపయోగించే వారు. ప్రస్తుతం షాంపూలు అందుబాటులోకి రావడంతో కుంకుడుకాయలను మరిచిపోతున్నారు. కానీ కుంకుడుకాయలు ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు దాగున్నాయి.
రెండు టీ స్పూన్స్‌ చొప్పున కుంకుడుకాయ, ఉసిరి పొడులు..మరో రెండు స్పూన్స్‌ తేనెతో కలిపి ఆ మిశ్రమాన్ని తలకి పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయండి.
తొలుత నూనెను జుట్టుకు పట్టించి మసాజ్ చేయాలి. అనంతరం గంట అనంతరం సహజంగా దొరికే కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయడం వల్ల జుట్టు ఊడే సమస్య తీరుతుంది.
కుంకుడుకాయ రసంలో కొద్దిగా వెనిగర్ కలపాలి. అందులో కొంచెం నీరు పోసి ఒక బాటిల్ లో భద్ర పరచుకోండి. ఈ మిశ్రమంతో కిటికీలు..తలుపులు..గాజు వస్తువులను శుభ్రపరచుకోవచ్చు.
తేలు కుట్టిన చోట కుంకడు గింజను అరగదీసి రాస్తే నొప్పి తగ్గుతుంది.

Don't Miss