2016..పోలీసు 'లవ్వాటలు' చూడండి..

13:45 - December 28, 2016

రక్షించాల్సిన భటులే అమ్మాయిల పాలిట శాపాలుగా మారుతున్నారు. 2016 సంవత్సరంలో ఎందరో పోలీస్ లవ్ గేమ్ లు బయటపడ్డాయి. డబ్బు ఎంతకావాలో చెప్పు ఇచ్చేస్తా..నువ్వు నా నుండి దూరం కావడమే..అధికారులు మందలించలినా ఓ ఎస్ఐ వినలేదు..

చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న సబ్ ఇన్స్ పెక్టర్..కానిస్టేబుల్ ప్రేమాయణం చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం ఆమె డబ్బుతోనే ఉద్యోగం కూడా సంపాదించుకుని ఎస్ఐ గా చేరిన అనంతరం ప్రియురాలిని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఉన్నతాధికారుల సమక్షంలో పెళ్లైనా భార్యను విడిచి మరో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. శివకుమార్ అనే వ్యక్తి చిత్తూరు జిల్లా కేవీపురం ఎస్ఐగా విధులు నిర్వరిస్తున్నాడు. అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతానికి చెందిన షేక్ నగీనా కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. మంచి ఉద్యోగం వచ్చే వరకు చదువుకుంటానని శివ కుమార్ చెప్పడంతో నగీనా డబ్బులు ఖర్చు చేస్తూ అతడిని చదివించింది. మధ్యలో వీఆర్ఓ గా ఉద్యోగం వచ్చింది. మంచి ఉద్యోగం కావాలని చెప్పడంతో ఎస్ఐ గా పరీక్షలు రాశాడు. అనంతరం ఉద్యోగం వచ్చింది. రెండు..మూడు రోజుల కాపురం చేసిన శివ..నగీనాను వదించుకోవాలని సిద్ధమయ్యాడు. మరో పెళ్లి చేసుకొనేందుకు సిద్ధమయ్యాడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. తనకు న్యాయం చేయాలని నగీనా కోరుతోంది. ఇంకా మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి....

Don't Miss