లక్నోలో 'భరత్ అనే నేను'..

13:46 - August 8, 2017

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' షూటింగ్ లతో బిజీ బిజీగా గడుపుతున్నారు. మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'స్పైడర్' షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ చిత్రం రిలీజ్ కాకముందే మరో సినిమాకు కూడా 'మహేష్' గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న 'భరత్ అనే నేను' షూటింగ్ లో మహేష్ పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న అనంతరం మరో షెడ్యూల్‌ కోసం లక్నో వెళ్లేందుకు చిత్ర బృందం రెడీ అవుతోంది. ఈనెల 10వ తేదీన ఈ షెడ్యూల్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది.

లక్నోలోని జహంగీరాబాద్ ప్యాలెస్, నాద్వా కాలేజ్, లక్నో యూనివర్సిటీల్లో షూటింగ్ జరుగనుంది. ఈ సినిమాలో సీఎంగా 'మహేష్' కనిపించనున్నట్లు తెలుస్తోంది. రాజకీయ నేపథ్యంలో సినిమా ఉంటుందని టాక్ రావడంతో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్‌ బాణీలు సమకూరుస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Don't Miss