సంక్రాంతి సంబరాలు

07:37 - January 14, 2018

చిత్తూరు : జిల్లాలోని తంబల్లపల్లి నియోజకవర్గం బి. కొత్తకోట మండలంలో ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన హార్సిలీహిల్స్‌లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఏపీ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. పర్యాటకశాఖ మేనేజర్‌ మురళి, మహేష్‌తోపాటు సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థులు, మహిళలకు వివిధ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ వేడుకలతో హార్సిలీహిల్స్‌లో పల్లెవాతావరణం ఉట్టిపడింది.
గుంటూరులో 
గుంటూరు జిల్లాలోని దుగ్గిరాలోని కొత్త రఘురామయ్య డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. దుగ్గిరాల దోస్త్‌ సేవ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈ  సందర్భంగా వివిధ రకాల పోటీలను నిర్వహించారు. రంగోలి పోటీ కన్నుల పండుగగా సాగింది. భారీ సంఖ్యలో విద్యార్థినులు, మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు.  భోగి మంటలు, గొబ్బెమ్మల పాటలతో చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

Don't Miss