షారూఖ్ కు షాక్..!

15:19 - August 8, 2017

బాలీవుడ్ బాద్ షా 'షారూఖ్ ఖాన్' తాజా చిత్రం 'జబ్ హ్యారీ మెట్ సెజల్' ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. భారీగా వసూళ్లు రాబడుతుందని అనుకున్నా అంతగా కలెక్షన్లు లేవని సోషల్ మాధ్యమాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇంతియాజ్ ఆలీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో షారూఖ్ సరసన అనుష్క శర్మ నటించింది. సయాని గుప్తా, ఎవ్లిన్ శర్మలు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా 3200 స్ర్కీన్లపై విడుదలైంది.

ఆగస్టు 4వ తేదీన వచ్చిన చిత్రంపై మిశ్రమ రివ్యూలు అందుకుంది. నాలుగు రోజుల్లో దేశ వ్యాప్తంగా రూ. 52.90 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. శుక్రవారం రూ. 15.25 కోట్లు, శనివారం రూ. 15 కోట్లు, ఆదివారం రూ. 15.50 కోట్లు, సోమవారం రూ. 7.25 కోట్లు మొత్తం రూ. 52.90 కోట్లు వసూలు చేసినట్లు ట్వీట్ చేశారు.

కానీ షారూఖ్ సినిమాల్లో తొలి రోజు వసూళ్ల పరంగా అతి తక్కువ రాబట్టిన చిత్రంగా పేర్కొంటున్నారు. 2014లో హ్యాపీ న్యూ ఇయర్ రూ. 44.97 కోట్లు, 2015లో దిల్ వాలే రూ. 21 కోట్లు, 2016లో ఫ్యాన్ రూ. 19.20 కోట్లు రాబట్టాయి. 

Don't Miss