సల్లూ భాయ్ దోషి...

11:44 - April 5, 2018

ముంబై : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కృష్ణ జింకల వేటాడిన కేసులో కీలక తీర్పు వెలువడింది. సల్మాన్ దోషి అంటూ జోధ్ పూర్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సల్మాన్ మినహా టబూ, సైఫ్ ఆలీఖాన్, నీలమ్, సోనాలి బింద్రేలను నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది.

16 ఏళ్ళ క్రితం ‘హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రం షూటింగ్ సందర్భంగా రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సల్మాన్ పై ఆయుధాల చట్టం కింద స్థానిక లూని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో సల్మాన్ నిర్దోషి అని రాజస్థాన్ హైకోర్టు ఇటీవలే తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాజస్థాన్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ కిందికోర్టు తీర్పును అమలు చేయాలని సుప్రీంని కోరింది. ఈ కేసులో సల్మాన్ దోషి అని, కోర్టులో లొంగిపోయి శిక్షను పూర్తి చేసే విధంగా చూడాలని కోర్టును కోరింది. ప్రస్తుతం శిక్ష ఎంతకాలం అనేది తెలియాల్సి ఉంది. 

Don't Miss