'సంజయ్' బయోపిక్ టైటిల్..

10:42 - October 9, 2017

బాలీవుడ్ లో బయోపిక్ ల హావా కొనసాగుతోంది. గతంలో..ఇటీవలే ప్రముఖ రాజకీయ, క్రీడా..ఇతర రంగాలకు చెందిన వ్యక్తుల జీవిత చరిత్ర ఆధారంగా పలు సినిమాలు నిర్మితమైన సంగతి తెలిసిందే. ఆయా పాత్రల్లో హీరోలు..హీరోయిన్లు నటించి అభిమానుల మెప్పు పొందారు. పలు చిత్రాలైతే కలెక్షన్ల వర్షం కురిపించాయి. తాజాగా బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ గా వెలిగిన 'సంజయ్ దత్' జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందుతోంది.

రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'రణబీర్ కపూర్' నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పలు విశేషాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అచ్చు సంజయ్ దత్ గా 'రణ బీర్' కనిపిస్తుండడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంజయ్ దత్ జీవితంలోని పలు కీలక ఘట్టాలను ఎలా తెరకెక్కిస్తారనేది ఉత్కంఠను కలుగ చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే చిత్ర బృందం సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ ఫిల్మ్ కు 'సంజూ' అని టైటిల్‌ పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో 'సంజయ్‌ దత్‌'ను ముద్దుగా 'సంజూ బాబా' అని పిలుస్తారనే సంగతి తెలిసిందే. కానీ చిత్ర బృందం మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. పరేశ్ రావల్..మనీషా కోయిరాలా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 30వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు టాక్. 

Don't Miss