2016 బుక్ ఫెస్టివల్ విశేషాలు..
13:34 - December 25, 2016
హైదరాబాద్ వాసులకు డిసెంబర్ మాసం అనగానే టక్కున గుర్తుకొచ్చేది పుస్తక మహోత్సవం. ఈ మహోత్సవాలలో పుస్తకాలు విరివిగా దొరకడమే కాకుండా పలు అరుదైన పుస్తకాలు బుక్ ఫెస్టివల్ లో లభించటం ప్రత్యేకత. ఈ ఏడాది బుక్ ఫెయిర్ డిసెంబర్ 15 నుంచి 26 వరకూ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగుతున్నాయి. బుక్ ఫెయిర్లో సుమారు 300కు పైగా స్టాళ్లు ఉండడం, ప్రతి రోజూ ఏదో ఒక సాహిత్య పరమైన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. ప్రతియేటా 10 రోజుల పాటు జరిగే బుక్ ఫెయిర్ ఈ ఏడాది 12 రోజులు నిర్వహిస్తున్నారు. బుక్ ఫెయిర్ నిర్వ హించే 12 రోజుల్లో 10 రోజుల పాటు ప్రత్యేకంగా సాహి త్యోత్సవాలు జరుగుతుండడం విశేషం.