అప్పు తీర్చమన్నందుకు మహిళపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు...

17:11 - January 31, 2018

కొమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమన్నందుకు ఓ మహిళా అని చూడకుండా ముగ్గురు వ్యక్తులు కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. బెజ్జూరు మండలం మర్తిడిలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రగాయాలైన స్రవంతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే.. తనపై స్థానిక నేతలు ముగ్గురు కిరోసిన్‌ పోసి నిప్పంటించారని పోలీసులకు మరణ వాంగ్మూలం ఇచ్చింది. దీంతో పోలీసులు ముగ్గురు నాయకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత కొంతకాలంగా స్థానిక నాయకులు, స్రవంతి మధ్య గొడవలు జరుగుతున్నాయి. వారం రోజుల క్రితం గ్యాస్‌ లీకై స్రవంతి ఇళ్లు దగ్ధమైంది. అయితే... ఆ ప్రమాదానికి నాయకులే కారణమని స్రవంతి తన వాంగ్మూలంలో తెలిపింది. 

 

Don't Miss