పెత్తందారుల ఆగడాలు...

10:32 - January 9, 2018

నిజామాబాద్‌ : జిల్లాలో పెత్తందారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మెండోర మండలం, బుస్సాపూర్‌గ్రామంలో సర్పంచ్‌ కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేశారు. సర్పంచ్‌ జుక్కల మమత, ఆమె కుటుంబ సభ్యులకు పాలు, నీళ్లు ఇవ్వొద్దని పెత్తందారుల హుకుం జారీచేశారు. తమ భూమిని గ్రామానికి ఇవ్వాలని అగ్రకుల పెద్దలు ఒత్తిడి చేస్తున్నారని సర్పంచ్‌ జుక్కల మమత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెత్తందారుల ఆగడాల నుంచి తమను కాపాడాలని కలెక్టర్‌కు సర్పంచ్‌ దంపతులు ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

Don't Miss