జయంతి నటరాజన్‌ నివాసంలో సీబీఐ సోదాలు

10:34 - September 10, 2017

ఢిల్లీ : కేంద్ర పర్యావరణ శాఖ మాజీ మంత్రి జయంతి నటరాజన్‌ నివాసంలో సీబీఐ తనిఖీలు చేసింది. పర్యావరణ మంత్రి హోదాలో నేరపూరిత కుట్ర, అక్రమాలకు పాల్పడినట్లు ఆమెపై ఆరోపణల నేపథ్యంలో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. యూపీఏ హయాంలో జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్‌లకు జార్ఖండ్‌లోని అటవీ భూములను  అక్రమంగా కేటాయించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి పర్యావరణ శాఖకు చెందిన ఇద్దరు ఉన్నత అధికారులపై సీబీఐ వేర్వేరుగా కేసులు నమోదు చేసింది. తమిళనాడుకు చెందిన జయంతి నటరాజన్‌ జులై 2011 నుంచి డిసెంబరు 2013 వరకు పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తన నిర్ణయాల్లో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అతి చొరవ చూపిస్తున్నారనే కారణంతో జనవరి 2015లో పార్టీకి రాజీనామా చేశారు..

 

Don't Miss