'పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం సిగ్గుచేటు'

13:33 - August 12, 2017

కామారెడ్డి : జిల్లాలో ప్రొఫెసర్‌ కోదండరాం, ప్రజా, విద్యార్ధి సంఘ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అమరవీరుల స్ఫూర్తి యాత్రను టీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకోవడం.. కామారెడ్డి మున్సిపాల్ ఆఫీసు ముందు సభ టెంట్‌ ధ్వంసం చేయడం సిగ్గు చేటని సీఐటీయు నేతలన్నారు. అధికార పార్టీ అహంభావంతో దాడి చేయడం సరి కాదన్నారు. దాడి చేసిన వారిని అరెస్ట్‌ చేయకుండా.. దాడికి గురైనవారిని అరెస్ట్‌ చేయడంపై మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం సిగ్గుచేటని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సిద్ధిరాములు అన్నారు. 

Don't Miss