కీలక నేతలతో మళ్లీ బాబు భేటీ...

11:25 - February 14, 2018

విజయవాడ : గత కొన్ని రోజులుగా ఏపీలో విభజన హామీల అమలు..ప్రత్యేక హోదా అమలు చేయాలంటూ కేంద్రంపై అధికార..విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిదే. దీనిపై ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రధానంగా ప్రతిపక్షమైన వైసీపీ ఒక్కసారిగా వ్యూహం మార్చేసింది. తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న జగన్ ప్రకటనతో రాజకీయ వేడి మరింత రగులుకుంది. దీనితో టిడిపి అప్రమత్తమైంది. టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం అందుబాటులో ఉన్న కీలక నేతలు, ఎంపీలు, మంత్రులతో సమావేశమయ్యారు. జగన్ వ్యాఖ్యలతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. విభజన హామీలు..భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న సంగతి తెలిసిందే. కానీ ఏప్రిల్ 6వ తేదీన ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ ప్రకటించడంలో ఆంతర్యం ఏమి ఉంటుందనే దానిపై చర్చించనున్నారు. 

Don't Miss