తల్లి జీవితాన్ని ఇస్తే నదులు సర్వస్వాన్నిస్తాయి : చంద్రబాబు

13:02 - September 13, 2017

విజయవాడ : తల్లి జీవితాన్ని ఇస్తే.. నదులు సర్వస్వాన్ని ఇస్తాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అలాంటి నదుల్ని వారసత్వ సంపదగా పూజించి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్‌ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన ర్యాలీ ఫర్ రివర్స్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. జగ్గీ వాసుదేవ్ చేపట్టిన మహత్తర కార్యక్రమానికి తాను సంపూర్ణ సహకారాలు అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ర్యాలీ ఫర్‌ రివర్స్‌ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని జగ్గీ వాసుదేవ్ కోరారు. నదులు అంతరించిపోతే విపత్తులు సంభవిస్తాయని ఆయన హెచ్చరించారు. ర్యాలీ ఫర్‌ రివర్స్‌లో అందరూ భాగస్వాములు కావాలని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ పిలుపునిచ్చారు. విజయవాడలో ర్యాలీ ఫర్ రివర్స్ కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. నదులు అంతరించిపోతే విపత్తులు సంభవిస్తాయని జగ్గీ వాసుదేవ్ హెచ్చరించారు. 25 ఏళ్లుగా నదులు స్వరూపం కోల్పోతున్నాయని.. నదుల పరిరక్షణకు అందరూ నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. 

Don't Miss