మొబైల్ మనీకే ప్రాధాన్యం:చంద్రబాబు

12:19 - January 9, 2017

విశాఖ : డిజిటల్ ఇండియాలో మొబైల్ మనీకే ప్రాధాన్యం ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖ నగరంలో ఈ గవర్నెన్స్ పై 20వ జాతీయ సదస్సు ప్రారంభం అయ్యింది. ఈ సదస్సుకు సీఎం చంద్రబాబుతో పాటు వెంకయ్యనాయుడు, పలువురు కేంద్ర మంత్రులు, 400 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఏపీలో పేపర్ లెస్ ఆఫీసు విధానం తీసుకువస్తామన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయని, ప్రస్తుతం 34శాతం డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. 2017 చివరి నాటికి డిజిటల్ లావాదేవీలు 55-60 శాతానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. స్టార్టప్ లకు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నామన్నారు.

Don't Miss