ఉప ఎన్నికలు వస్తే వైసీపీ 5 స్థానాల్లో టీడీపీ గెలుపు : సీఎం చంద్రబాబు

07:16 - June 14, 2018

గుంటూరు : వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన ఐదు స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే  టీడీపీయే గెలుస్తుందన్నారు సీఎం చంద్రబాబు. అమరావతిలో తిరుపతి పార్లమెంట్ స్థాయి నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో చర్చించారు. కార్యకర్తలను సంతృప్తి పరిచే విధంగా కార్యక్రమాలను నిర్వహించాలని నేతలను ఆదేశించారు. గ్రామ దర్శిని, గ్రామ సభలలో ఎంపీలు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్‌చార్జీలు పాల్గొనాలని సూచించారు. రాజీనామాలపై వైసీపీ ఎంపీలు బీజేపీతో కలిసి డ్రామాలు ఆడుతున్నారని చంద్రబాబు అన్నారు. ఓడిపోతామనే భయంతోనే రాజీనామాలు ఆమోదింప చేసుకోవట్లేదన్నారు. 

 

Don't Miss