ముచ్చుమర్రిని రాయలసీమకు ప్రాణనాడిగా మారుస్తాం : సీఎం చంద్రబాబు

17:42 - January 7, 2018

కర్నూలు : జిల్లాలో నిర్మిస్తున్న ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమకు ప్రాణనాడిగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కర్నూలు జిల్లాలో జరిగిన జన్మభూమి..మావూరు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి... నదుల అనుసంధానం, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన ఖర్చుల వివరాలను ప్రకటించారు. వచ్చే మార్చి, ఏప్రిల్‌ నాటికి కొత్తగా 11 ప్రాజెక్టులను ప్రారంభిస్తామని చెప్పారు. 

 

Don't Miss