పెట్టుబడులతో రండి..

21:24 - July 9, 2018

అమరావతి : ఆర్ధికాభివృద్ధిలో దూసుకుపోతున్న ఆంధప్రదేశ్‌కు విదేశీ సంస్థలు ఇతోదికంగా సాయం అందించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ప్రస్తుతం పదిన్నర శాతంగా ఉన్న ఆర్థికాభివృద్ధిని 12 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందని సింగపూర్‌లో జరుగుతున్న నగరాల సదస్సులో చంద్రబాబు చెప్పారు. ఈ లక్ష్య సాధనకు విదేశీరుణ సంస్థలు సహకరించాలని చంద్రబాబు కోరారు.

ప్రపంచ నగరాల సదస్సులో పట్టణీకరణపై సీఎం ప్రసంగం
సింగపూర్‌లో జరుగుతున్నప్రపంచ నగరాల సదస్సులో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు... వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. బిజినెస్‌ రౌండ్‌ టేబుల్‌ సమాశంలో పాల్గొన్న చంద్రబాబు..ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ప్రపంచ నగరాల సదస్సులో పట్టణీకరణ-నీరు, పర్యావరణం, ప్రజా రవాణ నిర్వహణ.. అన్న అంశంపై ప్రసంగించారు.

నివాసయోగ్యమైన నగరాల నిర్మాణంలో నీరే కీలకం -బాబు
ఆర్థికాభివృద్ధిలో ఏపీ శరవేగంగా దూసుకుపోతున్న విషయాన్ని చంద్రబాబు వివిధ సంస్థల సీఈవోల దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం ఉన్న పదిన్నర శాతం ఆర్థికాభివృద్ధి రేటును 12 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని ప్రస్తావించారు. దీనిని 14 నుంచి 15 శాతానికి పెంచేందుకు అంతర్గతంగా చర్యలు చేపట్టామని పలు సంస్థల ప్రతినిధులకు వివరించిన చంద్రబాబు.. ఇందుకు వారి సహకారంకావాలని అర్థించారు. సరళతర వాణిజ్య విధానంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. జాప్యం లేకుండా విధాన నిర్ణయాలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రపంచ నగరాల సదస్సులో ప్రసంగించిన చంద్రబాబు.. నివాసయోగ్యమైన నగరాల రూపకల్పనలో నీరు, పర్యావరణ అంశాలతోపాటు మౌలిక వసతులు కీలకపాత్ర పోషిస్తాయన్న విషయాన్ని గుర్తు చేశారు. అమరావతిని ఈ దిశగా అభివృద్ధి చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.

Don't Miss