విశాఖ భూస్కాంపై బాబు సీరియస్ అయ్యారంట..

21:21 - June 18, 2017

విశాఖపట్టణం : భూకుంభకోణంపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. డీఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ సిట్‌ చీఫ్‌ గా వ్యవహరించనున్నారు. దర్యాప్తు బృందం సభ్యులుగా విశాఖ జేసీ సృజనతో పాటు డీఎస్పీలు, ఆర్డీవోలు ఉన్నారు. రెండు నెలల్లోపు ఈ బృందం నివేదిక అందిస్తుందని ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. విశాఖ భూవివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారని.... భూముల రికార్డ్స్ తారుమారు చేయడంపై స్పెషల్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు. 25 భూరికార్డ్స్‌ ట్యాంపరింగ్‌ అయ్యాయని తెలిపారు. రికార్డ్స్‌ను ట్యాంపరింగ్‌ చేసిన వారిపై తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ట్యాంపరింగ్‌పై ఇప్పటికే మూడు కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. మొత్తంగా 270 ఎకరాల భూమి ట్యాంపరింగ్‌ అయ్యిందని.. ఇందులో 265 ఎకరాలు ప్రభుత్వ భూములున్నాయన్నారు.

Don't Miss