రైతుల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం - బాబు...

16:35 - June 4, 2018

విజయనగరం : ఏపీ రాష్ట్రంలో నవ నిర్మాణ దీక్షలు కొనసాగుతున్నాయి. ఆయా జిల్లాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. ప్రభుత్వం వస్తున్న విమర్శలకు ప్రతి విమర్శలు..కేంద్రంపై కౌంటర్ లు ఇస్తున్నారు. సోమవారం విజయనగరం జిల్లాలో జరిగిన నవ నిర్మాణ దీక్షలో ఆయన పాల్గొని ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.

నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు అమ్మినా ఎవరిని వదిలి పెట్టేది లేదని, కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. రైతుకు సంఘీభావం తెలియచేయాలని, వారితో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. దేశంలో ఎంతో మంది రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్ర మంత్రులు స్పందించడం లేదని, స్వామి నాథన్ కమిషన్ ప్రకారం గిట్టుబాటు ధర ఇస్తామని..50 శాతం లాభం ఇస్తామని చెప్పి ప్రస్తుతం ముందుకు రావడం లేదని విమర్శించారు. రైతు దగ్గర పంట ఎక్కువగా ఉంటే ఎగుమతులకు అనుమతులివ్వాల్సి ఉంటుందన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss