ప్రకృతిని కాపాడుకోవాలి : సీఎం చంద్రబాబు

15:33 - January 7, 2018

కర్నూలు : ప్రకృతిని కాపాడుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కర్నూలులో నిర్వహించిన జన్మభూమి..మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ప్రకృతిని మనం కాపాడితే.. ప్రకృతి మనల్ని కాపాడుతుందని తెలిపారు. నీరు, చెట్లు, అడవులు, ఖనిజ సందపను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు. నేటితో జన్మభూమి ఆరో రోజుకు చేరిందన్నారు. రోజుకో అంశంపై, అన్ని అవసరాలపై జన్మభూమి కార్యక్రమంలో చర్చ చేస్తున్నామని తెలిపారు. జన్మభూమిలో అన్ని సమస్యలపై చర్చిస్తున్నామని చెప్పారు. సహజ వనరులు, అభివృద్ధిపై చర్చ చేస్తున్నామని తెలిపారు. 16 వేల గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి..సమస్యలపై చర్చిస్తామని చెప్పారు. చరిత్రను ఎవరూ మార్చలేరన్నారు. ప్రతిపక్షం తనను అనేక ఇబ్బందులకు గురి చేసిందని వాపోయారు. పట్టిసీమ పూర్తి కాకూడదని, పట్టిసీమ రాకూడదని కుట్ర పన్నారని ఆరోపించారు. కృష్ణా పుష్కరాలను పెద్ద ఎత్తున నిర్వహించామని తెలిపారు. రైతు లేకపోతే ఎవరికీ తిండి లేదన్నారు. రైతులకు 24 వేల కోట్లు రుణమాఫీ చేశామని చెప్పారు. రైతు విముక్తి చేశామన్నారు. ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Don't Miss