వినూత్న 'జన్మభూమి': చంద్రబాబు

16:58 - January 10, 2017

నెల్లూరు : జన్మభూమి కార్యక్రమాన్ని గతంలో కన్నా వినూత్నంగా నిర్వహిస్తున్నామని చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో నాల్గో విడత జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. మహిళలు గర్భం దాల్చిన దగ్గర నుంచి కాన్పు వరకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామన్నారు. తల్లీబిడ్డలను ఎన్టీఆర్‌ కిట్‌ ఇచ్చి ఉచితంగా ఇంటిదగ్గర వాహనంలో దింపుతామన్నారు. ఆ తర్వాత బిడ్డకు పోషకాహార లోపం లేకుండా చూస్తామని.. చదువు దగ్గర నుంచి ఉద్యోగం వచ్చే వరకు అన్ని రకాలుగా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. యువతుల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు.

Don't Miss