క్షురకులతో ప్రభుత్వం చర్చలు విఫలం..

19:01 - June 18, 2018

విజయవాడ : వేతనాలు పెంచాలని డిమాండ్ తో పాటు మరికొన్ని డిమండ్స్ తో గత కొన్ని రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న క్షురకులతో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అమరావతిలోని సచివాలంలో చర్చించారు. గత కొంతకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో క్షురకులకు పీఎఫ్ సౌకర్యం, రూ.15వేలు కనీసన వేతనం చెల్లించాలని క్షురకులు డిమాండ్ చేస్తు నిరసన దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో కేసీ కృష్ణమూర్తి వారి నాయకులతో చర్చించిన చర్చలు విఫలమయ్యాయి. సీఎం చంద్రబాబు దృష్టికి క్షురకుల సమస్యలను తెలిపి సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని..దానికి సమయం ఇవ్వాలనీ..ఈలోపు నిరసన విరమించాలని కోరారు. అయినా క్షురకుల నాయకులు వినకుండా చర్చలు మధ్యలోనే వెళ్లిపోయారని కేఈ తెలిపారు. కేఈతో చర్చల అనంతరం వెళ్లిపోతున్న సమయంలో సీఎం కాన్వాయి సచివాలయానికి రావటంతో క్షురకులు కాన్వాయ్ ని అడ్డుకున్నారు. ప్రతీ తలనీలాలకు రూ.25 చొప్పున ఇవ్వాలని క్షురకులు డిమాండ్ చేశారు. దీనిపై అంగీకరించని సీఎం చంద్రబాబు రూ.15 చొప్పున ఇస్తామని మొదట్లో చెప్పినా తరువాత రూ.25 ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో క్షురకులు వాగ్వాదానికి దిగిన నేపథ్యంలో క్షురకులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.25లు కనీసవేతనం కంటే ఎక్కువే వస్తుందని సీఎం చంద్బరాబు స్పష్టంచేశారు రెగ్యులర్ చేసే అవకాశం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. దీంతో ఆగ్రహంచిన క్షురకులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ డిమాండ్స్ నెరవేర్చేంత వరకూ తమ సమ్మెను కొనసాగిస్తామని స్పష్టంచేశారు.

Don't Miss