విజయవాడలో ర్యాలీ ఫర్ రివర్స్

08:15 - September 14, 2017

కృష్ణా : మావన నాగరికతకు మూలాధారమైన నదులు అంతరించి పోతున్నాయని.. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఇపుడు మానవాళిపై ఉందన్నారు ఈశాఫౌండేషన్‌ వ్యవస్థాపకులు జగ్గీవాసుదేవ్‌. దేశవ్యాప్తంగా చేపట్టిన ర్యాలీఫర్‌ రివర్స్‌ కార్యక్రమం విజయవాడలో ఉత్సాహంగా జరిగింది. నదులు అంతరించి పోతుండటం.. ప్రపంచానికి పెనువిపత్తును తెచ్చిపెడుతుందని జగ్గీవాసుదేవ్‌ అన్నారు. గత 25 ఏళ్లుగా దేశంలో నదులు స్వరూపం కోల్పోతున్నాయని.. ఫలితంగా భవిష్యత్తులో తాగునీరు కూడా కరువయ్యే పరిస్థితులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా అందరూ మేల్కొని.. నదులను కాపాడుకోడానికి నడుం బిగించాలన్నారు. తల్లి జీవితాన్ని ఇస్తే.. నదులు సర్వస్వాన్ని ఇస్తాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నదుల్ని వారసత్వ సంపదగా గుర్తించి కాపాడుకోవాలన్నారు. ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్ చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమానికి తాను సంపూర్ణ సహకారాలు అందిస్తానని చంద్రబాబు తెలిపారు. ర్యాలీఫర్‌ రివర్స్‌ కార్యక్రమంలో జగ్గీవాసుదేవ్‌, సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. సభలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

Don't Miss