సభ సాక్షిగా కేసీఆర్ హెచ్చరికలు...

11:07 - March 13, 2018

హైదరాబాద్ : అరాచక శక్తుల పీచమణుస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సోమవారం నాడు జరిగిన ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశార. కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయడం సమర్థిస్తున్నట్లు, ఇలాంటి ఘటనలు గత నాలుగు సంవత్సరాల నుండి జరగలేదన్నారు. గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రభుత్వంపై విషపూరిత ప్రచారం చేస్తున్నారని, అంతేగాకుండా తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తూ.. దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడి చేసినట్లు తమకు సమాచారం ఉందని, రాజకీయాల్లో ఇంత అసహనం పనికి రాదన్నారు. శాసనసభను హుందాగా నడిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి సభ్యునిపై ఉందని సభకు తెలిపారు.

నాలుగేళ్ల నుంచి శాంతిభద్రతలు అదుపులో ఉండడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, అరాచక శక్తులను ఎలాంటి పరిస్థితిలో ప్రోత్సహించడం జరగదన్నారు. రాజకీయ నాయకుల ముసుగులో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రతి అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పలుసార్లు చెప్పడం జరిగిందని, ఎన్ని రోజులైనా చర్చ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ.. కాంగ్రెస్ నేతలు గొడవ చేయడం సబబు కాదన్నారు. 

Don't Miss