ఉద్యోగ సంఘాల నేతలతో కేసీఆర్ భేటీ..

18:47 - May 16, 2018

హైదరాబాద్ : ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఉద్యోగులు ప్రతిపాదించిన 18 డిమాండ్లపై కేసీఆర్ చర్చిస్తున్నారు. కాగా గతకొద్దిరోజుల క్రితం మంత్రి వర్గ ఉప సంఘంతో భేటీ అయి పలు సమస్యలపై చర్చించి 18 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉద్యోగ సంఘాలు వుంచాయి. పలు చర్చల అనంరం మంత్రివర్గ ఉపసంఘం సీఎం కేసీఆర్ కు నివేదికను అందజేసింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాల నేతలకు చర్చలకు ఆహ్వానించారు. అనంతరం కేవలం 10మంది ఉద్యోగులను మాత్రమే చర్చలకు కేసీఆర్ అనుమతించారు. 

Don't Miss