ఆర్వీబీఆర్ చిరస్మరణీయుడు- కేసీఆర్..

19:15 - August 22, 2017

హైదరాబాద్ : తెలంగాణ గర్వించదగిన నాయకుడు రాజ్ బహద్దూర్ వెంకటరామిరెడ్డి అని సీఎం కేసీఆర్ కొనియాడారు. రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో శ్రీ రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి (రెడ్డి) ఎడ్యుకేషనల్ క్యాంపస్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఆయన ఎంతో మందికి జీవితం ప్రసాదించారని, వెంకటరామిరెడ్డి నెలకొల్పిన హాస్టల్ లో చదవి ఎంతో మంది ప్రయోజకులయ్యారని తెలిపారు. రెడ్డి హస్టల్ అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందింది కాదని, ఇందులో అన్ని కులస్తుల వారికి స్థానం కల్పించారన్నారు. అందుకే రెడ్డి హస్టల్ ను తెలంగాణ వారసత్వ సంపదగా చూడాలని, దీనికి ప్రభుత్వం ఇచ్చే నిధులను అలాగే చూస్తామన్నారు. హైదరాబాద్ పోలీసు అకాడమీకి వెంకట రామిరెడ్డి పేరు పెడుతామన్నారు.

సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన ఎడ్యుకేషనల్ క్యాంపస్‌ లో రెడ్డి బాలుర, బాలికల వసతి గృహం, కెరీర్ కోచింగ్ సెంటర్, కన్వెన్షన్ హాల్స్, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు ఇందులో ఏర్పాటు కానున్నాయి. శంకుస్థాపన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రెడ్డి సంఘాల నేతలు, ఆర్‌బీవీఆర్‌ఆర్ విద్యాసంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Don't Miss