చేనేతలకు ప్రోత్సాహం అందిస్తాం : సీఎం కేసీఆర్‌

07:14 - August 11, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలో చేనేతలకు అవసరమైన చేయూత, ప్రోత్సాహం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. చేనేతల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నామని... వారి అభ్యున్నతికి బహుముఖ వ్యూహంతో ముందుకెళ్లాల్సిన అవసరముందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం, పద్మశాలి సంక్షేమ సంఘం కలిసి పని చేయాల్సిన అవసరముందన్నారు. ప్రగతిభవన్‌లో వివిధ పద్మాశాలీ, చేనేత కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమైన కేసీఆర్‌... పలు అంశాలపై చర్చించారు. చేనేత వృత్తిని వదిలిపెట్టిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. వస్తున్న సాంకేతిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అవసరమైన వృత్తిపరమైన మార్పులు తీసుకురావాలన్నారు. హైదరాబాద్‌లో పద్మశాలీ భవనం నిర్మాణానికి రెండున్నర ఎకరాల స్థలం.. 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. చేనేత సంక్షేమం కోసం ఏర్పాటు చేయబోయే నిధికి తమ పార్టీ తరపున 50 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. 

 

Don't Miss