మూడు చింతలపల్లికి గోదావరి జలాలు : సీఎం కేసీఆర్

13:35 - August 8, 2017

మేడ్చల్ : మూడు చింతలపల్లికి గోదావరి జలాలు అందిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో సీఎం మాట్లాడారు. మేడ్చల్ జిల్లాలో 374 చెరువులను నింపుతామని చెప్పారు. మూడు చింతలపల్లిలో ప్రాథకమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. వారంలో పీహెచ్ సీ భవనానికి మంత్రి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. గోదావరి నది నుంచి 40 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చుకుంటామని చెప్పారు. గోదావరి నీళ్లు వస్తున్నాయి కనుక..బోర్లు వేసే బాధ తప్పుతుందన్నారు. గ్రామాలు బాగుపడాలని పేర్కొన్నారు. రైతుకు కులం లేదన్నారు. రైతులకు కావాల్సిన భూమి, నీరు, కరెంట్ అందివ్వాలని తెలిపారు. ప్రతి గ్రామానికి రైతు సంఘాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సంవత్సరానికి ఎకరానికి 8 వేల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇది రైతులందరికీ వర్తిస్తుందన్నారు. భూమి రికార్డులన్నీ సెట్ రైట్ కావాలన్నారు. ప్రతి ఊర్లో ఏ భూమి ఎవరి పేరు మీద ఉందో తేలాలని తెలిపారు. గ్రామ గ్రామాన భూ సర్వే చేస్తామని చెప్పారు. లంచాలు ఇచ్చే దుస్థితి పోవాలన్నారు. రైతులకు పాస్ పుస్తకాలు ఇస్తామని తెలిపారు. తెలంగాణలో రైతాంగం దెబ్బతిందని...అప్పుగానటువంటి పెట్టుబడి సమకూర్చాలన్నారు. సమైక్య రాష్ట్రంలో నదులు ఎండిపోయాయని పేర్కొన్నారు. 'ఆంధ్రవారు మన నోరు కొట్టి నీరు తీసుకపోయిండ్రు' అని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి 13 లక్షల మంది వలసలు పోయారని పేర్కొన్నారు. 

 

Don't Miss