కరుణ ఆరోగ్యం కోసం అన్ని చర్యలు : సీఎం పళని

12:31 - July 28, 2018

తమిళనాడు : డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం గురించి సీఎం పళనిస్వామి ఆరా తీసారు. అవసరమైతే కరుణానిధి ఆరోగ్యానికి సంబంధించి అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని పళనిస్వామి హామీ ఇచ్చారు. కరుణానిధి ఆరోగ్యం మెరుగుపడుతుందని..మెరుగుపడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ క్రమంలో ఆజాద్ కరుణానిధి కుమారుడు స్టాలిన్ ను, కుమార్తె కనిమొళిని పరామర్శించారు. కాగా 93 సంవత్సరాల వయస్సు డీఎంకే అధినేత కరుణానిధికి అసంఖ్యాంగా అభిమానులున్నారు. వీరంతా ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకుని ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. ఒకపక్క వృద్ధాప్య కారణం మరోపక్క లోబీపీతో బాధపడుతున్న కరుణానికి తీవ్ర అస్వస్థతతో కావేరీ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన మాత్రం కొనసాగుతోంది.

Don't Miss