జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : సీఎం కేసీఆర్

18:02 - February 17, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం కేసీఆర్ అన్నారు. జర్నలిస్టు నిధికి ఇప్పటి వరకు రూ. 20 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. జర్నలిస్టు నిధికి మరో రూ. 30 కోట్ల నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామన్నారు. ప్రగతి భవన్ లో నిర్వహించిన 'జన హిత దర్భార్' కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. మరణించిన జర్నలిస్టుల అమ్మాయిల పెళ్లిళ్లకు రూ.3 లక్షల ఆర్ధికసాయం రేపే మంజూరు చేస్తామన్నారు. గురుకుల పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఏవైనా సమస్యలుంటే ప్రెస్ అకాడమీ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని తెలిపారు. వచ్చే బడ్జెట్ లో జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.30 కోట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. జర్నలిస్టులకు ఖచ్చితంగా పీఎఫ్, ఈఎస్ ఐ కల్పించాలన్నారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలనే భావనతో ఓ కార్యక్రమం చేయాలనుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రెస్ అకాడమీ చేపట్టడం అభినందనీయమన్నారు. జనహితం కార్యక్రమంలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబసభ్యులకు ఆర్థిక సహాయాన్ని కేసీఆర్ అందచేశారు. జర్నలిస్టులకు ఏ ఇబ్బందులున్నా ఆదుకొనేందుకు ముందుంటామన్నారు. పేద జర్నలిస్టు కుటుంబాలను ఆదుకొనే బాధ్యత తమదేనన్నారు. చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు ఏ జిల్లా వారికి ఆ జిల్లాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామన్నారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే విధంగా చేసే కార్యక్రమాలను జర్నలిస్టులు ప్రచారం చేయాలని సూచించారు.

 

Don't Miss