యూపీ సీఎంగా యోగి ఆదిత్యానాథ్ ప్రమాణస్వీకారం

14:27 - March 19, 2017

యూపి : ఉత్తర్‌ప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌(44)గా ప్రమాణస్వీకారం చేశారు. లఖ్‌నవూలోని కాన్షీరామ్‌ స్మృతి ఉపవన్‌లో ఆదివారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. యోగి తో గవర్నర్ రాంనాయక్ ప్రమాణస్వీకారం చేయించారు. డిప్యూటీ సీఎం లుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మతో పాటు మంత్రులుగా 43 మంది ప్రమాణస్వీకారం చేశారు. ఆదిత్యనాథ్ కేబినెట్ లో ఆరుగురు మహిళలకు చోటు కల్పించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్‌, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, యూపీ మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్‌యాదవ్‌, ములాయంసింగ్‌ యాదవ్‌ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

Don't Miss