కేంద్రం అఫిడవిడ్‌ దాఖలు చేయడం దారుణం : నాయుడు ప్రకాశరావు

16:03 - July 7, 2018

ప్రకాశం : ఏపీ విభజన హామీలపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయటం దారుణమని సీపీఐ సీనియర్‌ నేత నాయుడు ప్రకాశరావు అన్నారు. విభజన హామీలు అమలుతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లో ధర్నా నిర్వహించి, సీపీఐ నగర కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీ, తెలుగు దేశం పార్టీలు ఇచ్చిన హామీల అమలుకు నోచుకోలేదని సీపీఐ నేతలు మండిపడ్డారు.

 

Don't Miss