గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం : రామకృష్ణ

17:01 - July 8, 2018

అనంతపురం : పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోకుండా మోదీ సర్కార్‌ రైతులను మోసం చేస్తుందన్నారు. రైతుల సమస్యలపై ఈనెల 10న విజయవాడలో సమావేశమమై... భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ప్రజాసమస్యలపై సదస్సులు, బస్సుయాత్రలు చేపడతామని.. ఉభయ కమ్యూనిస్టులు కలిసి పోరాటాలు చేస్తాయన్నారు. 

 

Don't Miss