ఖమ్మంలో అపరిశుభ్ర వాతావరణం : నున్న నాగేశ్వర్‌రావు

13:58 - February 11, 2018

ఖమ్మం : నగరం పర్యావరణ, పారిశుద్య సమస్యలకు నిలయంగా మారిందని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వర్‌రావు విమర్శించారు. ఖమ్మంలో ఎక్కడ చూసినా అపరిశుభ్రత కనిపిస్తోందన్నారు. దీంతో పర్యావరణం దెబ్బతింటోందన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో పర్యావరణ, పారిశుద్ద్య సమస్యలను పరిష్కరించాలంటూ 2కె రన్‌ నిర్వహించారు. పెవిలియన్‌ గ్రౌండ్‌లో ప్రారంభమైన ఈ రన్‌... అంబేద్కర్‌ విగ్రహం వరకు సాగింది. లకారం ట్యాంక్‌ ఖమ్మానికి మణిహారంకాదన్నారు. సినిమా యాక్టర్లను తీసుకొచ్చి ఖమ్మం అంతా అభివృద్ధి చెందినట్టు టీఆర్‌ఎస్‌ ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. 

 

Don't Miss