రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం - మధు...

12:46 - February 13, 2018

విజయవాడ : విభజన హామీలు, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇలాంటి హామీలు నాలుగేళ్లుగా నాన్చుతూ వస్తున్నారని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. రానున్న కాలంలో పెద్ద ఎత్తున్న ఉద్యమం నిర్మిస్తామన్నారు. రూ. 6600 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉంటే రూ. 421 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందని, పోలవరం రూ. 971 కోట్లు ఇచ్చిందని, ఇంకా రూ. 3400 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి నిర్మిస్తామని చెప్పారని..కానీ నిర్మాణం నత్తనడకన సాగుతోందన్నారు. రాష్ట్ర మహాసభలో చర్చించడం జరిగిందని, రాష్ట్రంలో కలిసొచ్చే వారితో పెద్ద ఉద్యమం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఉద్యమం నడిచిందని, 32 మంది యువకులు పోలీసు కాల్పుల్లో చనిపోతే అప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడి నోటి వెంట 'సుప్రీంకోర్టుకు వెళుతాం' అన్న దాని తరువాత రాజకీయ వేడి నెలకొందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నడుమ ఈనెల 8వ తేదీన వామపక్షాలు బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని, కానీ బంద్ మంచిది కాదని..ఇబ్బందులు వస్తాయని బాబు పేర్కొన్నారని తెలిపారు. ఇప్పుడు స్వాతంత్ర్య పోరాటం అంటూ టిడిపి కొత్త కథలు చెబుతోందని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందన్నారు.

స్వతంత్రంగా ఉద్యమాన్ని పైకి తీసుకపోయే విధంగా ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే దానిపై బుధవారం ఉదయం 11గంటలకు వామపక్షాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని, ఉద్యమంపై సుదీర్ఘంగా చర్చిస్తామన్నారు. బిజెపి నిధులు లెక్కలు ప్రస్తావిస్తుంటే ఉన్న విషయాలను టిడిపి స్పష్టంగా చెప్పలేకపోతోందని..రాష్ట్ర ప్రయోజనాలను నేలరాస్తోందన్నారు పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss