'బాబువి అవకాశవాద రాజకీయాలు'..

06:48 - April 16, 2018

విజయవాడ : ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ బంద్ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా సాధన కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కు వైసీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్ష నేతలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. పండిట్ నెహ్రూ వద్ద జరుగుతున్న బంద్ లో ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో పలువురు నేతలు మాట్లాడారు.

సీపీఎం మధు..
అవకాశవాద వైఖరి మరోసారి బట్టబయలైందని, గతంలో ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు చేస్తుంటే కేంద్రంతో ప్రత్యేక ప్యాకేజీకి సీఎం చంద్రబాబు ఒప్పుకున్నారని మధు పేర్కొన్నారు. రెండు నాల్కల ధోరణి అవలింబిస్తోందనడానికి ఇది ఒక ఉదహారణ అని, వెంటనే కేంద్రం ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మండల స్థాయిలో ప్రజలు పెద్ద ఎత్తున్న పాల్గొంటున్నారని, ఇందుకు ప్రజలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు.

సీపీఐ రామకృష్ణ...
ప్రత్యేక హోదా సాధన సమితిల పిలుపు మేరకు ఏపీలో బంద్ కొనసాగుతోందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. మూడేళ్లుగా సుదీర్ఘంగా జరుగుతున్న పోరాటం ఇదని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మెట్టు దిగాలని..హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ లో కూడా పోరాటం చేసి హోదా సాధించి తీరుతామన్నారు.

వైసీపీ పార్థసారధి..
నాలుగు సంవత్సరాలుగా హోదా వద్దని చెప్పిన సీఎం చంద్రబాబు ప్రజాగ్రహం చూసి..ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటం చూసి బాబు యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు. కానీ టర్న్ కూడా మోసమని ప్రతిపక్షాలకు ఇచ్చిన నోటీసులను బట్టి అర్థమైందన్నారు. బాబు చేపడుతున్న కార్యక్రమాలు మరోసారి మోసం చేయడానికనేని తెలిపారు.

వీరితో పాటు ఇతర నేతలు మాట్లాడారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss