బంద్ విజయవంతం..కృతజ్ఞతలు - మధు..

16:37 - February 8, 2018

విజయవాడ : ఏపీ బంద్ విజయవంతమైందని, సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు వెల్లడించారు. పెద్ద స్థాయిలో ఐక్యతను ప్రదర్శించారని, బంద్ విజయంతమైందన్నారు. ముందస్తు అరెస్టులు..బంద్ సందర్భంగా అరెస్టులు జరిగినా ఎక్కువ ప్రాంతంలో స్వచ్చందంగా ప్రజలు సహకరించారని తెలిపారు.

విభజన చట్టంలో బీజేపీ చేసిన హామీలు అమలు జరుపకుండా పార్లమెంట్ లో బుధవారం ప్రధాన మంత్రి చేసిన ఉపన్యాసంలో కాంగ్రెస్ ను తప్పుగా నిర్ధారించారని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ అమలు జరపడంలో బీజేపీ వైఫల్యం చెందిందని, రైల్వే జోన్ అంశానికి వచ్చే సరికి చర్చలు జరుగుతున్నాయని మంత్రి పేర్కొనడం జరుగుతోందన్నారు. నాలుగు సంవత్సరాలు సరిపోలేదా ? అని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా విభజన చట్టంలో పేర్కొన్న వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీరిని చూస్తుంటే జాతీయ విద్యా సంస్థలు పూర్తి కావడానికి 20 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని తెలిపారు. కేంద్ర మంత్రివర్గం నుండి బయటకు వచ్చి మాట్లాడితే బాగుంటుందని..అలాకానిపక్షంలో టిడిపి చేసే పోరాటం ఉత్తుత్తిదేనని ప్రజలు భావిస్తారన్నారు. జేఏసీ తరహాలనే తాము ఇతరులతో పనిచేయడం జరుగుతోందని, జేఏసీ ఏర్పాటుకు పవన్ ప్రయత్నిస్తుండడం అభినందనీయమన్నారు. మేధావులతో సంప్రదింపులుగా భావించాల్సి ఉంటుందని, కేంద్రంపై పోరాటం..విభజన హామీలు సాధించడానికి ఎవరూ ముందుకొచ్చినా వారిని కలుపుకుంటామన్నారు. 

Don't Miss