వరంగల్‌ అర్బన్‌ ప్రాంతాల్లో కొనసాగుతున్న సీపీఎం పాదయాత్ర

19:05 - January 3, 2017

వరంగల్ అర్బన్ : సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి సాధనే ధ్యేయంగా చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర... వరంగల్‌ అర్బన్‌ ప్రాంతాల్లో కొనసాగుతోంది. 79వ రోజు పాదయాత్ర బృందం కరీమాబాద్‌, శాయంపేట, అదాలత్‌, ఆర్‌ఈసీ, ఖాజిపేట, రాంపూర్‌, మడికొండ, పెదపెండ్యాల ప్రాంతాల్లో పర్యటిస్తోంది. తమ్మినేని పాదయాత్రకు వివిధ పార్టీల స్థానిక నేతలు, ప్రజాసంఘాల నేతలు మద్దతు తెలిపారు. వరంగల్‌ ఎన్‌ఐటీ వద్ద తమ్మినేని పాదయాత్ర బృందానికి.. బీసీ సబ్‌ప్లాన్‌ సాధన సమితి రాష్ట్ర ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ మురళీమనోహర్‌తో పాటు..నిట్‌  కార్మికులు, ఎఫ్‌సీఐ కార్మికులు  ఎర్ర డ్రెస్సులు ధరించి అపూర్వ స్వాగతం పలికారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై తమ్మినేని వీరభద్రం ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఎస్సీల వాస్తవ పరిస్థితిపై నిర్మాణాత్మక చర్చ జరగాలని ఈ సందర్భంగా తమ్మినేని డిమాండ్‌ చేశారు. దళితుల సబ్‌ప్లాన్‌ నిధులను ఇతర రంగాలకు మళ్లించడం దారుణమని తమ్మినేని విమర్శించారు.  

 

Don't Miss