అన్ని అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు బీఎల్ ఎఫ్ పోటీ : తమ్మినేని

21:59 - April 10, 2018

సిద్ధిపేట : 2019 ఎన్నికల్లో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ తెలంగాణలోని 119 అసెంబ్లీ, 17 పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివమ్స్‌ గార్డెన్‌లో కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. ఈనెల 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో సీపీఎం జాతీయ మహాసభలు జరుగుతాయన్నారు. 22న భారీ బహిరంగసభ ఉంటుందని చెప్పారు. అలాగే ఈ నెల 13 నుంచి 22 వరకు ఎన్టీఆర్‌ స్టేడియంలో సైన్స్‌, బుక్‌ ఫెయిర్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 
 

 

Don't Miss