సీపీఎంపై సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు బాధకరం: మల్లారెడ్డి

15:56 - December 29, 2016

సిద్దిపేట : అసెంబ్లీలో సీపీఎంపై సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు బాధకరమన్నారు.. సిద్ధిపేట్‌ జిల్లా పార్టీ కార్యదర్శి మల్లారెడ్డి.. 2013 భూసేకరణ చట్టం ఉన్నప్పటికీ మళ్లీ కొత్త చట్టం తేవాల్సిన అవసరం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. ప్రజలను ఇబ్బందిపెట్టేలాఉన్న ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.. కేసీఆర్‌ కామెంట్స్‌కు నిరసనగా సిద్ధిపేట్‌ పాత బస్టాండ్‌ దగ్గర పార్టీ నేతలు, కార్యకర్తలు నోటికి నల్లబట్ట కట్టుకొని నిరసన తెలిపారు..

సీపీఎంపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు : జబ్బార్
సీపీఎంపై ... సీఎం కేసీఆర్‌ చేసిన వాఖ్యలకు నిరసనగా వనపర్తి జిల్లాలో సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నా.. సీపీఎంపై .. అనుచితంగా మాట్లాడడం సరికాదని.. జిల్లా కార్యదర్శి జబ్బార్‌ అన్నారు. అలాగే సీపీఎం ఎప్పుడూ పేద ప్రజల పక్షాన నిలబడుతుందని..ప్రజల సమస్యలపై పోరాటం ఆపదని...ఆయన అన్నారు. 

 

Don't Miss