ఎవరిదో పై చేయి..సైనా x పి.వి.సింధు...

06:42 - April 15, 2018

ఢిల్లీ : కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో భారత స్టార్‌ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు ఫైనల్స్‌కు చేరుకున్నారు. దీంతో ఈ ఇద్దరిలో ఒకరికి స్వర్ణం మరొకరికి రజతం ఖాయమయ్యాయి. కానీ, ఎవరికి స్వర్ణం దక్కుతుందో అని ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెమీఫైనల్లో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థుల్ని మట్టి కరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఇవాళ జరిగే ఈ మ్యాచ్‌లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. 

Don't Miss