సైనాదే పై చేయి...

08:05 - April 15, 2018

ఢిల్లీ : : కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఆసక్తికర పోరు...భారత స్టార్ క్రీడాకారిణిల మధ్య పోటీ..ఎవరు గెలుస్తారు ? ఎవరు ఓడుతారు ? అనే ఉత్కంఠ కామన్ వెల్త్ గేమ్ లో చోటు చేసుకుంది. మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో భారత స్టార్‌ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు ఫైనల్స్‌లో తలపడ్డారు. నువ్వా..నేనా అన్నట్లుగా ఈ పోరు సాగింది. ఎవరికి స్వర్ణం దక్కుతుందా ? అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. చివరికి సైనానే పై చేయి సాధించింది. సింధుపై 21-18, 23-21 తేడాతో సైనా విజయం సాధించింది. సైనాకు స్వర్ణం..సింధుకు రజత పతకం లభించింది. మొత్తంగా 62 పతకాలు సాధించిన భారత్ మూడో స్థానంలో నిలిచింది. 

Don't Miss