భక్షకులుగా మారుతున్న రక్షకభటులు

19:34 - August 13, 2017

హైదరాబద్ : ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే... భక్షకులుగా మారుతున్నారు. అధికారం ఉందికదా అని చెలరేగిపోతున్నారు. ఓ భూ వ్యవహారంలో తలదూర్చిన నలుగురు పోలీసులు అధికారులపై కేసు నమోదయ్యింది. సైబరాబాద్‌ అదనపు డీసీపీ పులిందర్‌, రాయదుర్గం సీఐ దుర్గాప్రసాద్‌, ఎస్సై రాజశేఖర్‌, కానిస్టేబుల్‌ లక్ష్మీ నారాయణపై కేసులు నమోదు చేశారు. గతంలో మాదాపూర్‌ పరిధిలో రెండు ఎకరాల స్థలాన్ని అడిషనల్‌ డీసీపీ పులిందర్‌ కూతురు లీజ్‌ తీసుకున్నారు. అయితే ఇప్పుడు దాని లీజ్‌ ముగిసింది. ఈ భూమిని భూ యజమాకి ఇవ్వకుండా ఆ స్థలం తమదేనని పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని బాధితులతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. దీంతో బాధితులు సైబరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్యను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన సందీప్‌ శాండిల్య... నలుగురిపైనా కేసు నమోదు చేయాలని మాదాపూర్‌ ఏసీపీని ఆదేశించారు. దీంతో నలుగురిపైనా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

 

 

Don't Miss