రకుల్ మూవీ సెన్సార్ కి అడ్డంకులు

17:27 - February 2, 2018

సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ హీరో హీరోయిన్స్ గా నీరజ్ పాండే దర్శకత్వంలో 'అయ్యారీ' అనే హిందీ సినిమా రూపొందింది. రకుల్ హిందీ మూవీ సెన్సార్ కి అడ్డంకులు కలిగాయి. ఈ సినిమాను జనవరి 26వ తేదీనే విడుదల చేయాలనుకున్నారు. కానీ 'పద్మావత్' రిలీజ్ కారణంగా వాయిదా వేశారు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. మిలటరీ విభాగంలో తెర వెనుక జరిగే కొన్ని సంఘటనలు, ఆయుధాల ఒప్పందాలు, కుట్రలు మొదలైనవి ఈ సినిమాలో చూపించారట. దాంతో ఈ సినిమాను తాము చూసిన తరువాతనే సెన్సార్ సర్టిఫికేట్ ను జారీ చేయాలని రక్షణ శాఖ సెన్సార్ అధికారులను కోరినట్టుగా వార్తలు వచ్చాయి. రక్షణ శాఖ అధికారులు ఈ సినిమాను ఎప్పుడు చూస్తారనే విషయంలో క్లారిటీ లేదు. ఈ కారణంగా విడుదల తేదీ విషయంలో అయోమయం ఏర్పడిందని అంటున్నారు. అయితే సెన్సార్ కార్యక్రమాలు ఎప్పుడు పూర్తవుతాయో తెలియకపోవడంతో, యూనిట్ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

Don't Miss